విద్యార్థులకు అలర్ట్: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థుల కోసం జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిందని అధికారులు వెల్లడించారు. జనవరి 22 నుంచి జనవరి 30 వరకు ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ చివరి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, విద్యార్థులు ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో పాటు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.