స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రస్థానం దేశానికే ఆదర్శనీయం: యోగి ఆదిత్యనాథ్

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్‌ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాల్లో ట్రస్ట్ ప్రస్థానం దేశానికే ఆదర్శనీయమన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ట్రస్ట్ 25 ఏళ్లుగా సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.