భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం 64 శాతంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో ఓవర్లను కుదించే ఛాన్స్ ఉంది. రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టుతో జరిగే ఈ పోరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.