ఫీవర్ ఆసుపత్రి అభివృద్ధిపై కలెక్టర్ ప్రియాంక అ ఉన్నత స్థాయి సమీక్ష
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ హైదరాబాద్ డాక్టర్ ప్రియాంక అలా వెల్లడించారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, బడ్జెట్ ప్రతిపాదనలు మరియు ఆర్థిక నిర్వహణ తీరుపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ రానున్న ప్రణాళికలపై చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు.