ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్.. 2050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 2050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 438 ఎస్సై పోస్టులు, 1156 కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు మెకానిక్స్, డ్రైవర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. త్వరలో ఆన్లైన్ దరఖాస్తులు, పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించనున్నారు.