బొల్లారంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

బొల్లారం చెక్‌పోస్టు వద్ద కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్‌ నేతల కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేసీఆర్‌ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.