అమరావతి సచివాలయ భవనాల పనులకు కేబినెట్ ఆమోదం: బయోగ్యాస్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతిలో సచివాలయం మరియు విభాగాధిపతుల కార్యాలయాల టవర్లలో కీలక పనులు చేపట్టేందుకు ఏపీ ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పిస్తూ వర్చువల్ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో చిత్తూరు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు క్లీన్ ఎనర్జీ పాలసీకి పలు సవరణలు చేశారు. కాకినాడలో అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటుతో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.