మల్కాజిగిరిలో అండాల అక్రమ సేకరణ గుట్టురట్టు: నూటయాభై మంది బాధితులు గుర్తింపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: మల్కాజిగిరి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహిళల అండాల అక్రమ విక్రయాల దందాపై మల్కాజిగిరి సీపీ సుమతి కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నలభై తొమ్మిది మంది బాధితులను గుర్తించినట్లు తెలిపారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ ఈ దందా నడుపుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.