విమల్ పాన్ మసాలా ప్రకటనల వివాదం: అజయ్ దేవగన్ పిటిషన్ పై స్పందించిన ఎఫ్ డీ ఏ

రిపోర్టర్: గోపి స్థలం: पुणे

విమల్ పాన్ మసాలా ప్రకటనల వివాదంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ చట్టప్రకారమే విచారణ కొనసాగిస్తామని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అమినిస్ట్రేషన్ కమిషనర్ తుకారామ్ ముండే స్పష్టం చేశారు. నిషేధిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ లతో పాటు టైగర్ ష్రాఫ్ లకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక విచారణ పూర్తయిందని, తదుపరి నిర్ణయం కోసం ఈ కేసు జాయింట్ కమిషనర్ కు బదిలీ అయినట్లు అధికారులు తెలిపారు.