స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో కీలక మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాంకేతిక మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల పోలింగ్ అలాగే కౌంటింగ్ తేదీలను వాయిదా వేసినట్లు తెలిపారు. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్ను నవంబర్ 5కి, నవంబర్ 5న జరగాల్సిన కౌంటింగ్ను నవంబర్ 7వ తేదీకి మార్చామని, అభ్యర్థులకు ప్రచార గడువు పెరిగిందని అధికారులు స్పష్టం చేశారు.