ఉపాధ్యాయులపై దాడి రౌడీషీటర్లకు వైకాపా మద్దతునిస్తోందన్న గోనుగుంట్ల కోటేశ్వరరావు
రిపోర్టర్: వెంకట్
స్థలం: గుంటూరు
విజయవాడలో ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన రౌడీషీటర్లకు వైకాపా మద్దతుగా నిలుస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. గుంటూరులో దివ్యాంగులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాల పేరుతో గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించిన దివ్యాంగుల కష్టం జగన్‌కు తెలియదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.