సత్యవాన్ సావిత్రి చిత్రం నుంచి చక్కరై పిల్ల సాంగ్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యవాన్ సావిత్రి సినిమా నుంచి చక్కరై పిల్ల పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించగా, కమలజ రాజగోపాల్ మరియు కిరణ్ బిజు ఈ గీతాన్ని ఆలపించారు. రామ్ శ్రీవత్స సాహిత్యమందించిన ఈ చిత్రం నవంబర్ ఇరవయ్యవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు వెల్లడించాయి.