నాయుడుపేటలో లిథియం యూనిట్ ఏర్పాటుపై మంత్రి లోకేశ్తో చర్చలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ఎన్ఏఎన్ గ్రీన్ మెట్ వ్యవస్థాపక ఛైర్మన్ నవీన్ అగర్వాల్తో మంత్రి నారా లోకేశ్ అమరావతిలో సమావేశమయ్యారు. ఈ భేటీలో నాయుడుపేటలో ఏర్పాటు చేయనున్న లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ శంకుస్థాపనకు ఆహ్వానించారు. క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.