గ్రామీణ పేదల ఆరోగ్యానికి శ్రీరామరక్షగా ఉచిత వైద్య శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నెన్నల్

మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ శిబిరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, డాక్టర్ చందన సుధాకర్, పి. మహేష్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు విశేషంగా పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.