విజయనగరం జిల్లాలో ప్రైవేట్ చిట్టీల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా అయ్యన్నపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటుగా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న ఉద్యోగులు, కూలీలు, మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధిక లాభాల ఆశ చూపి రూ.లక్షల్లో వసూలు చేసి చేతులెత్తేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేని అనధికార చిట్టీలను నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.