ఇంద్రకీలాద్రిపై వైభవంగా సరస్వతీ దేవి దర్శనాలు: పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. మూలా నక్షత్రం పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మూడు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో నాలుగు వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు.