విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగర వాసుల చిరకాల స్వప్నమైన మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ. 11,488 కోట్ల భారీ బడ్జెట్తో 46.22 కిలోమీటర్ల పొడవైన మార్గంలో 43 స్టేషన్లతో ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని, భవిష్యత్తులో ఈ సేవలను భోగాపురం విమానాశ్రయం వరకు పొడిగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.