ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన షూటర్లు అనంత్, పరినాజ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల 2026లో భారత షూటర్లు అనంత్ జీత్ సింగ్ నరుక, పరినాజ్ ధలివాల్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. మిక్డ్స్ స్కీట్ టీమ్ ఈవెంట్‌లో వీరు కాంస్య పతకం కైవసం చేసుకుని దేశానికి మరో పతకాన్ని అందించారు. ఫైనల్ పోరులో భారత జంట 44 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్ మెరుగైన స్థానం కారణంగా కొరియా రజతం దక్కించుకోగా, చైనా స్వర్తం సాధించింది.