సినిమా విడుదల వాయిదా: అనివార్య కారణాలతో ఆదర్శకుటుంబం మూవీ పోస్ట్ పోన్
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆదర్శకుటుంబం సినిమా విడుదల వాయిదా పడినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే హీరో వెంకటేష్‌తో చర్చించి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నాగవంశీ వెల్లడించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.