హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణ స్వీకారం

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం చేశారు. అమరావతిలోని హైకోర్టు భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు, ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు.