భారత్‌పై ఎల్ నినో ప్రభావంపై వాతావరణ నిపుణుల స్పష్టత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రమవుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో భారత్‌లో శీతాకాలంపై ఆందోళన నెలకొంది. అయితే అంతర్జాతీయ అంచనాలను నేరుగా భారత్‌కు వర్తింపజేయలేమని దేశీయ వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. స్థానిక భౌగోళిక అంశాలు, ఉపరితల గాలులు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఆధారంగానే ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారుతాయని, ఈసారి చలికాలంపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.