తెదేపా సీనియర్ నేత గుషిడి రమణ మృతితో చీపురుపల్లిలో విషాదం
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు గుషిడి రమణ అనారోగ్యంతో శుక్రవారం వేకువజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన ఆయన, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1983 నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేసిన ఆయన మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.