డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ తిప్పలు: ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌తో వాహనదారులకు తప్పని ఇబ్బందులు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియలో రవాణాశాఖ ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ అప్రూవల్ సాఫ్ట్వేర్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ తెలిపారు. ఆధార్ కార్డు, లైసెన్స్‌లో వివరాలు వ్యత్యాసంగా ఉండడం, చరవాణి నంబర్లు సరిపోకపోవడం వంటి సాంకేతిక కారణాలతో నిత్యం ఎంతోమంది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వివరాలు పూర్తిగా సరిపోలితేనే ఇకపై లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యపడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.