అంతరిక్షంలో అద్భుతం: జాబిల్లికి సమీపంలో శుక్ర గ్రహం దర్శనం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమలాపురం

అంతరిక్షంలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జాబిల్లికి అతి సమీపంగా శుక్ర గ్రహం కనిపించి కనువిందు చేసింది. ఈ రమణీయమైన ఖగోళ దృశ్యాన్ని అమలాపురం సమీపంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని బాలుర్‌ఘట్‌లో ప్రజలు స్పష్టంగా వీక్షించారు. ఖగోళ శాస్త్రవేత్తలు మరియు ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించి ఆశ్చర్యపోయారు. ఈ అరుదైన సంఘటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.