అమెరికాలో సంచలనం: ఐయోవా కాపిటోల్ లో సాతానిక్ టెంపుల్ వేడుకలకు అనుమతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: Iowa

అమెరికాలోని ఐయోవా రాష్ట్ర కాపిటోల్ భవనంలో సాతానిక్ టెంపుల్ స్థానిక శాఖా వేడుకలు నిర్వహించుకునేందుకు ఫెడరల్ జడ్జి స్టేఫనీ రోజ్ అనుమతి మంజూరు చేశారని అధికారులు తెలిపారు. గతంలో రాష్ట్ర నాయకత్వం ఈ విజ్ఞప్తులను తిరస్కరించగా, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారంటూ ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది.