జంగారెడ్డిగూడెంలో భారీగా మత్తు ఇంజెక్షన్ల పట్టివేత, నిందితుల అరెస్టు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఏలూరు
జంగారెడ్డిగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7,550 ట్రెమడాల్ మత్తు ఇంజెక్షన్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీ శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్, కార్పెంటరీ షాపులో వీటిని దాచిపెట్టాడు. నిందితుడి విచారణలో భవానీ మెడికల్స్‌కు కూడా ఇంజెక్షన్లు సరఫరా చేసినట్లు తేలింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ శోభ హెచ్చరించారు.