'నన్ను మోసం చేస్తావా..': బెంగళూరులో నర్సుపై భర్త యాసిడ్, మారణాయుధాలతో దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని బెంగళూరు జేపీ నగర్ మూడో దశ ప్రాంతంలో కలకలం రేపిన ఘటనలో, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త వెంకటేశన్ తన భార్య, నర్సుగా పనిచేస్తున్న మధుమితపై మారణాయుధం మరియు యాసిడ్తో దారుణంగా దాడి చేశాడు. గురువారం ఉదయం క్లినిక్ సమీపంలో అల్పాహారం కోసం వెళ్లిన మధుమితను వెంబడించి బేస్మెంట్లో ఈ దురాగ్యానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు మరియు స్థానికులు నిందితుడు వెంకటేశాన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.