రాష్ట్రంలో జనవరి 1 నుంచి 'సంజీవని' యాప్ సేవలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య సేవల వ్యవస్థ 'సంజీవని' యాప్‌ను ప్రభుత్వం తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయుష్ శాఖను దీనితో అనుసంధానించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా యోగా, ప్రకృతి చికిత్స సేవలు, ఆరోగ్యకర జీవనశైలికి సంబంధించిన వీడియోలను ప్రజలకు నేరుగా అందించనున్నారు.