స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్‌కుమార్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు వారిని సస్పిండ్ చేస్తూ సభలో తీర్మానం ఆమోదించారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది.