ట్రైన్లో కత్తులతో దొంగల బీభత్సం: జోధ్పూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల ఆందోళన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Jodhpur

జోధ్పూర్-గాంధీగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో కత్తులతో ప్రవేశించిన దుండగులు మొబైల్ ఫోన్లు చోరీ చేశారని, ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్పై రైల్వే శాఖ స్పందించింది. కదులుతున్న రైలు నుంచి నలుగురు ఐదుగురు యువకులు దూకి పరారయ్యారని, వారి కోసం గాలించినా ఆచూకీ దొరకలేదని అజ్మీర్ ఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.