కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కొత్త సినిమా ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: చెన్నై

కోలీవుడ్ యువ హీరో శివ కార్తికేయన్ తన ఇరవై ఏడో సినిమాను అధికారికంగా ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. పార్కింగ్ చిత్ర దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ను సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. సినిమా ప్రకటనతో పాటు షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.