భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పాఠశాలలకు సెలవు

రిపోర్టర్: నరేష్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.