ఖమ్మంలో భక్తిశ్రద్ధలతో పోటెత్తిన దేవీ నవరాత్రుల ముగింపు మహా అన్నదానం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించగా మహిళా కమిటీ సభ్యులు భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు. ప్రజల మధ్య ఐక్యత మరియు సోదరభావం పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.