సన్నాయి నాదాలతో ఆకట్టుకున్న బాలు వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో మూడు రోజులుగా ఎంతో వైభవంగా సాగిన బాలు స్వరనీరాజనం ఆదివారంతో ముగిసింది. ముగింపు వేడుకల్లో భాగంగా కుప్పిలి గోవిందరావు నేతృత్వంలో బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను సన్నాయి నాదాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా గోవిందరావుతో పాటు వారి బృందాన్ని నిర్వాహకులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.