అర్హులందరికీ ఏడాదిలోగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో అర్హులందరికీ ఏడాదిలోగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యంతరం లేని ఇళ్ల పట్టాలన్నింటినీ పది రోజుల్లో క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి 5.32 లక్షల గృహాలు పూర్తి కావాలన్నారు. ఆధార్ ఆధారంగా అనర్హుల ఏరివేత చేపట్టాలని, కుటుంబమే యూనిట్‌గా సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు.