ముంబై విమానాశ్రయంలో విదేశీ పర్యటన మోసం బట్టబయలు

రిపోర్టర్: మహేష్ స్థలం: ముంబై

పూణెకు చెందిన ఓ వ్యాపారి విదేశీ పర్యటన కోసం మరో మహిళతో కలిసి ముంబై విమానాశ్రయానికి వెళ్లగా, ఆమె పాస్‌పోర్ట్ సమస్య కారణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తన వివాహేతర సంబంధం బయటపడకుండా ఉండేందుకు వ్యాపారి విదేశీ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ సమస్య తలెత్తిందని, తన ఫోన్ జప్తు చేశారంటూ భార్యకు అబద్ధం చెప్పి కనిపించకుండా పోయాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆ వ్యక్తి అసలు నిజం చెప్పడంతో డ్రామా రట్టయింది.