శ్రీశైలంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: ఐదో రోజు స్కందమాతగా భ్రమరాంబిక దర్శనం

రిపోర్టర్: సురేష్ స్థలం: ശ్రీశైలం

తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీశైలంలో వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి మరియు భ్రమరాంబిక సన్నిధిలో నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు సంతాన ప్రదాత అయిన స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని పండితులు పేర్కొన్నారు. ఈ దివ్య అవతారంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సత్సంతానం కలుగుతుందని, సకల సంపదలతో పాటు ధైర్యం చేకూరుతుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని వారు తెలిపారు.