మనుబోలు వినాయక గుడిలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వినాయక గుడి వద్ద కొలువుదీరిన గణేశునికి నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉభయ దాతలుగా పండి కట్టి రవి అండ్ బ్రదర్స్ వ్యవహరించగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఏడవ రోజు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది.