వెంకటాచలంలో ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలిన టీడీపీ నేత ఖయ్యూం ఖాన్
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి పఠాన్ ఖయ్యూం ఖాన్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సహచరులు ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యుల పరీక్షలు మరియు నివేదికల ఆధారంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రానుంది.