సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆర్మరీ ఆయుధాల చోరీ కేసు ఛేదన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీ నుంచి భారీగా ఆయుధాలు చోరీకి గురైన ఘటనను మిలిటరీ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఛేదించాయి. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, నాగర్ కర్నూలు జిల్లాలో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్ర వెనుక ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి మాస్టర్ మైండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.