విజయవాడలో తీవ్ర కలకలం: బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల గుర్తులు తారుమారు
రిపోర్టర్: అశోక్
స్థలం: Vijayawada
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని యాభై ఐద డివిజన్ లో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తారుమారు కావడం తీవ్ర కలకలం రేపింది అని అధికారులు తెలిపారు. వైసీపీ అభ్యర్థి షేక్ హసన్ భాషా పేరు ఎదుట కాంగ్రెస్ హస్తం గుర్తు, కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్ షేక్ పేరు పక్కన వైసీపీ ఫ్యాన్ గుర్తు ముద్రించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈ వ్యవహారంపై బాధిత అభ్యర్థి రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారని సమాచారం.