మహిళలపై దాడి ఘటనపై కన్నెర్రజేసిన క్రైస్తవ ఐకాస నేతలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

హైదరాబాద్ అల్మాస్గూడలో ఇద్దరు క్రిస్టియన్ మహిళలపై జరిగిన దాడిని ఖమ్మం జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. తుంపాల కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆనందబాబు, తిమోతి, మాచర్ల శేఖర్బాబు, సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.