గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న తహశీల్దార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేలేరుపాడు

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈనెల 26 తెల్లవారుజామున భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, 27న రెండవ హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశం ఉందని వేలేరుపాడు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, గర్భిణులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, మునిగిన రోడ్లు, వాగులు దాటవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 9014102968ను సంప్రదించాలని కోరారు.