శంకర నేత్రాలయ రత్న పురస్కారం: కాటంరెడ్డి ప్రసాదరెడ్డికి ఘన సత్కారం
రిపోర్టర్: సునీల్
స్థలం: చెన్నై
చెన్నైలోని శంకర నేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కాటంరెడ్డి ప్రసాద రెడ్డి, శోభా రెడ్డి దంపతులకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక శంకర రత్న పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారి సేవలను వక్తలు కొనియాడగా, సంస్థకు అదనంగా మరో లక్ష డాలర్ల విరాళాన్ని ప్రసాదరెడ్డి అందజేసినట్లు అమెరికా విభాగ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి వెల్లడించారు.