బెంగళూరుకు చేరుకున్న టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్

రిపోర్టర్: సురేష్ స్థలం: Bengaluru

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను వంతంగా ముగించుకుని, బెంగళూరు టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ఫాంట్రీ బెటాలియన్ శుక్రవారం బెంగళూరుకు తిరిగి చేరుకుంది. కల్నల్ తేజస్ బి కండే నేతృత్వంలో ఈ దళం జూన్ 2023 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఎలాంటి ఘటనలకు తావులేకుండా సేవలు అందించింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తరఫున ఎన్ఏ హారిస్ తదితరులు సైనికులకు ఘన స్వాగతం పలికారు.