నల్లమలలో వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న పెద్దపులులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ప్రకాశం
నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరుసగా పెద్దపులులు మృత్యువాత పడుతున్నాయి. తురిమెళ్ల రేంజ్ పరిధిలో మరో పులి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా రాచర్ల బీట్ పరిధిలోనూ గోళ్ల కోసం పులిని చంపేశారు. గస్తీ నిర్వహించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని, కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.