యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎండీఆర్ ఛార్జీలు, జీఎస్టీ వసూళ్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైన తప్పుడు రూమర్లు మాత్రమేనని కొట్టిపారేశాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి ఆధారాలు లేని వదంతులను ప్రజలు నమ్మవద్దని కేంద్ర వర్గాలు విజ్ఞప్తి చేశాయి.