లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన సీడీపీవో పద్మ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మెట్పల్లి
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ సమయంలో రిమార్కులు రాయకుండా ఉండేందుకు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి ఐసీడీఎస్ సీడీపీవో డి.పద్మ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కినట్లు అనిశా కరీంనగర్ రేంజ్ ఇన్ఛార్జి డీఎస్పీ మధు తెలిపారు. అంగన్వాడీ టీచర్ల నుంచి మూడు నెలలకు సంబంధించి రూ.63 వేల లంచం సొమ్మును కార్యాలయం బయట తీసుకుంటుండగా ఆమెను అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కరీంనగర్ అనిశా కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.