ICC టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన భారత మహిళా క్రికెటర్లు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

మహిళల ఆసియా కప్ విజయం తర్వాత తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన స్థానాలు సాధించారు. అద్భుత ప్రదర్శనతో శ్రీ చరణి బౌలింగ్ జాబితాలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, దీప్తి శర్మ రెండో స్థానానికి ఎగబాకారు. అలాగే షఫాలీ వర్మ బ్యాటర్ల జాబితాలో టాప్-6లోకి దూసుకెళ్లారు.