వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్పై కుప్పంలో కేసు నమోదు
రిపోర్టర్: రాము
స్థలం: చిత్తూరు
కుప్పంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. చావడానికైనా, చంపడానికైనా సిద్ధపడే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లర్లకు దారితీసేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రక్తంతో యుద్ధం చేసి గెలుస్తామంటూ భరత్ చేసిన వ్యాగ్యాలు తీవ్ర దుమారం రేపాయి.